BREAKING: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం.. విచారణకు నటి హేమ డుమ్మా

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Update: 2024-05-27 06:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో అరెస్ట్ అయిన టాలీవుడ్ నటి హేమతో పాటు మరో ఎనిమిది మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే బెంగళూరు క్రైం బ్రాంచ్ పోలీసులు వారందరిని విచారిస్తున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. కేసులో విచారణకు హాజరయ్యేందుకు తనకు మరికొంత సమయం కావాలని క్రైం బ్రాంచ్ పోలీసులకు లేఖ రాసింది. ప్రస్తుతం తాను వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు అందులో పేర్కొ్ంది. కానీ, హేమ రాసిన లేఖను సీసీబీ పోలీసులు పరిగణలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని హేమకు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.

కాగా, బెంగళూరు రేవ్‌ పార్టీలో 150 మంది పాల్గొనగా.. అందులో 86 మంది డ్రగ్స్‌ తీసుకున్నట్లుగా బ్లడ్‌ శాంపిల్స్‌లో పాజిటివ్‌గా వచ్చింది. దీంతో, వారంతా ఇవాళ విచారణకు హాజరు కావాలని సీసీబీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన వారిలో టాలీవుడ్‌ నటి హేమ కూడా ఉన్నారు. అదేవిధంగా బెంగళూరు రేవ్‌ పార్టీకి సంబంధించిన కేసులో పోలీసులు ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. అలాగే, వారి బ్యాంకు ఖాతాలను కూడా ఫ్రీజ్‌ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన వాసు బ్యాంక్‌ ఖాతాల్లో భారీ మొత్తంలో నగదు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.   

Read More...

Rave Party: దేవుళ్లం కాదంటూ.. తప్పును ఒప్పుకున్న హేమ (వీడియో) 

Tags:    

Similar News