బ్రేకింగ్ : పొంగులేటి ఇంటికి ఈటల.. ప్రాధాన్యత సంతరించుకున్న తాజా భేటీ

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పార్టీ దూకుడు పెంచింది.

Update: 2023-05-04 05:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పార్టీ దూకుడు పెంచింది. తాజాగా బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల, ఖమ్మంలోని మాజీ ఎంపీ పొంగులేటి నివాసానికి బయలుదేరారు. మధ్యాహ్నం పొంగులేటితో ఈటల లంచ్ మీటింగ్ ఉండనున్నట్లు సమాచారం. అయితే పొంగులేటిని బీజేపీలోకి ఈటల ఆహ్వానించనున్నట్లు తెలిసింది.ఈ మేరకు ఈటల కాసేపటి క్రితం ఖమ్మం బయలుదేరి వెళ్లారు. అయితే తాజా పరిణామం నేపథ్యంలో పొంగులేటి నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. తాజా భేటీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 

Read More:   పొంగులేటితో ఈటల భేటీ.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Tags:    

Similar News