‘ఓ బీఆర్ఎస్ నాయకుడి స్వార్థం వల్ల గ్రాడ్యుయేట్ బై ఎలక్షన్’

నల్లగొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-05-23 07:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన ప్రేమేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఓ బీఆర్ఎస్ నాయకుడి స్వార్థం వల్ల గ్రాడ్యుయేట్ ఉప ఎన్నిక వచ్చిందని మండిపడ్డారు. అసలు ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటు అడిగే హక్కు లేదని అన్నారు. మరోవైపు గ్యారంటీలు అంటూ గొప్పలకు పోయి.. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకే పరిమితం అయిందని విమర్శించారు. సన్న వడ్లకే బోనస్ ఇస్తామని చెప్పడం దారుణమన్నారు. పార్టీలు మారిన వారికి బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌లు టికెట్లు కేటాయించాయని అన్నారు. తాను పార్టీలు, కండువాలు మార్చే వ్యక్తిని కాదని వెల్లడించారు. ప్రజా సమస్యలపై నిత్యం తన పోరాటం కొనసాగిస్తానని అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మెజార్టీ సీట్లు దక్కించుకుంటామని తెలిపారు.



 


Tags:    

Similar News