రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ, బీఆర్ఎస్ డ్రామాలు: మహేష్ గౌడ్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒప్పందం మేరకు ఆరోపణలు చేసుకుంటున్నాయని టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అన్నారు.

Update: 2023-03-08 06:34 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒప్పందం మేరకు ఆరోపణలు చేసుకుంటున్నాయని టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అన్నారు. కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడంపై బుధవారం స్పందించిన ఆయన ఈ కేసు దర్యాప్తుపై అనుమానాలు ఉన్నాయన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటేనని ఈ కేసులో నోటీసులు, అరెస్టులు అన్ని రాజకీయ లబ్ధి కోసమే జరుగుతున్నాయని ధ్వజమెత్తారు.

కవితను గతంలో సీబీఐ విచారించింది. తాజాగా ఈడీ నోటీసులు పంపింది. భవిష్యత్‌లో ఆమెను దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేసినా చేయవచ్చని చెప్పారు. అయితే దీని వెనుక పొలిటికల్ మైలేజ్ కోణం ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బలహీనపరిచి బీజేపీని పెంచడానికే కేసీఆర్ ఈ పని చేస్తున్నారని మండిపడ్డారు. జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనించాలని సూచించారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News