మద్యం ప్రియులకు బిగ్ అలర్ట్.. ఇంకొన్ని గంటలే తెరిచి ఉండేది!

పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది.

Update: 2024-05-10 11:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లు, రిటర్నింగ్ ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్‌ సిబ్బందికి మౌలిక సదుపాయాలతో పాటు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారపర్వం ముగియనుంది. రేపు(శనివారం) సాయంత్రం ఎక్కడికక్కడ మైకులు మూగబోనున్నాయి. దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు కూడా మూసివేయాలని ఇప్పటికే ఎక్సైజ్ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ నెల(మే) 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వైన్ షాపులు, బార్లు, మద్యం సరఫరా చేసే రెస్టారెంట్లు, కల్లు కంపౌండ్‌లు మూతపడనున్నాయి. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ఈ రెండ్రోజులు మద్యం షాపులు మూసివేయాలని అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ పార్లమెంట్ ఎన్నికలను తెలంగాణలోని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు సీరియస్‌గా తీసుకున్నాయి. ఎలాగైనా సత్తా చాటాలని వ్యూహాత్మకంగా ప్రచారం నిర్వహించాయి. కాంగ్రెస్, బీజేపీలు ఢిల్లీ నుంచి అగ్రనేతలను దించి ప్రచారం చేయించాయి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News