హైదరాబాద్‌లో మరో కిడ్నీ రాకెట్ కలకలం

హైదరాబాద్‌లో మరో కిడ్నీ రాకెట్ వెలుగు చూసింది.

Update: 2024-05-24 03:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో మరో కిడ్నీ రాకెట్ వెలుగు చూసింది. హైదరాబాద్‌కు చెందిన వైద్యుడు ఈ కిడ్నీ రాకెట్‌లో కీలక సూత్రధారిగా ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ముఠా 40 మంది యువకులకు కిడ్నీ మార్పిడి చేయించినట్లు తేలింది. పేద యువకులకు డబ్బు ఆశ చూపి కిడ్నీ దందా జరిపినట్లు విచారణలో తేలింది. ఒక్కో కిడ్నీడి రూ.20 లక్షలు ఇస్తామని యువకులకు ముఠా ఎర వేసింది. ఆపరేషన్ తర్వాత రూ.6లక్షలను ముఠా ఇచ్చినట్లు తెలిసింది. కిడ్నీ ఇచ్చిన ఓ కేరళ యువకుడు ఇటీవల మృతి చెందినట్లు సమాచారం. దీంతో సదరు యువకుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సబిత్ అనే దళారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 20 మంది డోనర్లను ఇరాన్ తీసుకెళ్లినట్లు దళారి అంగీకరించాడు. హైదరాబాద్‌కు చెందిన వైద్యుడు, మరో ఇద్దరు దళారుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. 

Similar News