Breaking: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. ఆ ఫ్లైట్‌లోనే ఢిల్లీకి తరలింపు
తెలంగాణలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది...
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ అధికారులు ఉన్నట్టుండి విచారణ చేపట్టారు. ఎమ్మెల్సీ కవితను ఆమె ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నారు. పకడ్బందీగానే కవిత నివాసంలో సోదాలు చేసిన అధికారులు.. కవిత సెల్ ఫోన్లను సైతం సీజ్ చేశారు.
అంతకుముందు సైలెంట్‌గా కవిత నివాసంలోకి ఎంటర్ అయిన ఈడీ అధికారులు లోపలికి ఎవరినీ అనుమతించకుండా సెర్చ్, అరెస్ట్ వారంటీ జారీ చేశారు. ముగ్గురు న్యాయవాదులను వెంట బెట్టుకొని వెళ్లిన అధికారులు దాదాపు 4 గంటల పాటు ఎమ్మెల్సీ కవితను విచారించారు. పక్కా పథకం ప్రకారం ముందుగానే ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసుకునే వచ్చారు. రాత్రి 8 గంటల 45 నిమిషాలకు హైదరాబాద్ నుంచి వెళ్లే ఫ్లైట్‌లో ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ తీసుకువెళ్లనున్నారు. అనంతరం కోర్టులో ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో బీఆర్ఎస్ శ్రేణులకు భారీ షాక్ తగిలింది.
Read More..
BREAKING: ఎమ్మెల్సీ కవిత నివాసానికి KTR, హరీష్ రావు.. ఇంట్లోకి అనుమతించని ఈడీ