సంక్రాంతి తరువాత అందరికీ రైతుబంధు జమ చేస్తాం.. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

రైతుబంధుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Update: 2024-01-10 13:09 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రైతుబంధుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సంక్రాంతి పండుగ తరువాత రైతులందరికీ రైతుబంధు అందుతుందని స్పష్టం చేశారు. బుధవారం ఖమ్మంలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. రైతుబంధుపై ఎలాంటి అపోహలు వద్దని కోరారు. తమ ప్రభుత్వంలో నిజమైన అర్హులకు పథకాలు తప్పకుండా అందుతాయని పేర్కొన్నారు. రైతుబంధు నగదు విడతల వారీగా జమ అవుతున్న నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండగ తర్వాత అందకి ఖాతాలో పడతాయని మంత్రి క్లారిటీ ఇచ్చారు. కాగా, గత సీఎం కేసీఆర్ కేవలం మాటలకే పరిమితం అయ్యారని, కానీ ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి ద్వారా ప్రజల వద్దకు పథకాలు వెళుతున్నాయని తుమ్మల అన్నారు. అహంకారాన్ని ప్రజలు సహించరు అనడానికి తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పే నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రంలో కబ్జాల రాజ్యం పోవాలని ప్రజలు కోరుకున్నారని అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని తెలిపారు. 

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News