ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు

జన్నారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలోని మహిళలు నీటి ఎద్దడి

Update: 2024-05-22 09:32 GMT

దిశ,జన్నారం: జన్నారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలోని మహిళలు నీటి ఎద్దడి తలెత్తింది అంటు బిందెలు పట్టుకుని రోడ్డు పైకి వచ్చారు. తిమ్మాపూర్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో నీరు అడుగంటి పోయి బావులలో , బొర్లలోని నీరు ఎండిపోయి నీరు రావడం లేదని పంచాయతీ కార్యదర్శి ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోవడం లేదని అన్నారు. అదికారులు స్పందించి ట్యాంకర్ల ద్వారా నీటిని అందించి సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరారు.

Similar News