ఆసిఫాబాద్ జిల్లాలో పులి కలకలం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..

ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి పులి సంచారం కలకలం

Update: 2024-04-16 12:33 GMT

దిశ, ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి పులి సంచారం కలకలం రేపుతోంది. కాగజ్ నగర్ డివిజన్ పరిధిలోని అంకుసాపూర్ అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. మొన్నటి వరకు చింతలమానేపల్లి ప్రాంతంలో ఏనుగు బీభత్సం సృష్టించి ఇద్దరు రైతులను పొట్టనబెట్టుకున్న విషయం మరవకముందే, ఇప్పుడు మళ్లీ పులి సంచారం తో అటు ప్రజలు ఇటు అధికారులు హడలెత్తి పోతున్నారు. పులి సంచారం నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు కాగజ్ నగర్ లోని వంజిరి, నందిగాం, అంకుసాపూర్, వాంకిడిలోని ఖేరిట్, సర్కేపల్లి అటవీ పరిసర ప్రాంతాల్లోని గ్రామాల వద్ద ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో ఎవరు వెళ్లకుండా నిఘా పెట్టారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆ ప్రాంతంలో రోడ్లపై రాకపోకలను నిషేధించారు. వేసవి నేపథ్యంలో తాగునీటి కోసం పులులు, ఇతర అటవీ జంతువులు వచ్చే అవకాశం ఉందని, పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Similar News