దీక్ష చేసిన పట్టించుకోని అధికారులు.. దిందా గ్రామ గర్భణీలకు తప్పని ఇక్కట్లు..

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమానేపల్లి మండలం దిందా - The officials who did not respond to the construction of the bridge.. Dinda villagers are suffering

Update: 2022-09-22 10:28 GMT

దిశ, చింతలమానేపల్లి: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమానేపల్లి మండలం దిందా గ్రామంలోని గర్భిణీ మహిళ పద్మ (25) గురువారం పురిటి నొప్పులతో బాధపడుతూ ఉంది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకు వెళ్లాల్సి ఉండగా దారి లేక మహిళ అవస్తలు ఎదుర్కొంది. ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే మధ్యలో వాగు అడ్డం గా ఉండడంతో నాటు పడవలో ప్రమాదం అని తెలిసి కూడా గ్రామస్తులు అతి కష్టం మీద వాగును దాటించారు. ఇలాంటి కష్టాలు వస్తాయని దిందా గ్రామస్తులు వాగు ఒడ్డు పై 6 రోజులుగా సాధన దీక్ష చేసి, రెండు రోజులు 100 కిలోమీటర్ల పాదయాత్రతో కలెక్టరేట్‌కు ముట్టడి చేశారు.


ఇలాంటి కష్టాలు వస్తాయనే వాగుపై వంతెన నిర్మించాలని సాధన దీక్షలో చేసినప్పటికీ, పాలకులు, అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ప్రజలను మభ్యపెట్టే పనులు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని, ఇప్పటికైనా వాగుపై వంతెన నిర్మిస్తారని భరోసాతో ఉన్నామన్నారు.

Similar News