కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కమిటీ సభ్యుడిగా శ్రీహరి రావు

ఈనెల 28న మహారాష్ట్రలోని నాగపూర్ పట్టణంలో జరగనున్న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణ కమిటీ సభ్యుడిగా నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీహరి రావు నియమితులయ్యారు.

Update: 2023-12-21 14:02 GMT

దిశ, ప్రతినిధి నిర్మల్ : ఈనెల 28న మహారాష్ట్రలోని నాగపూర్ పట్టణంలో జరగనున్న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణ కమిటీ సభ్యుడిగా నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీహరి రావు నియమితులయ్యారు. మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షునిగా ఏడుగురు సభ్యులు బృందంలో శ్రీహరి రావు కూడా ఉన్నారు. మహారాష్ట్రలో నిర్వహిస్తున్న భారీ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఈ కమిటీ చూడనుంది. తనకు అప్పగించిన బాధ్యతలను పకడ్బందీగా నిర్వహిస్తానని, తనకు అవకాశం కల్పించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News