అదరహో కబడ్డీ పత్తి సీడ్ ధర...!

కుబీర్ మండలంతో పాటు, ముధోల్ నియోజకవర్గం, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లోనూ ఎటు చూసినా రైతుల నోటా కబడ్డీ మాటనే వినిపిస్తున్నది.

Update: 2023-06-10 10:27 GMT

దిశ, కుబీర్ : కుబీర్ మండలంతో పాటు, ముధోల్ నియోజకవర్గం, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లోనూ ఎటు చూసినా రైతుల నోటా కబడ్డీ మాటనే వినిపిస్తున్నది. వానాకాలంలో రైతులకు కబడ్డీ పోటీలు ఎదేని ఏజెన్సీ నిర్వహిస్తున్నదని అనుకుంటున్నారా..! అది కాదండోయ్ గత సంవత్సరం కబడ్డీ సీడ్ పత్తి విత్తనాలు మార్కెట్ లోకి వచ్చాయి. రైతులకు అధికంగా దిగుబడివచ్చిందో.. లేదా సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ కంపెనీవారు అధికంగాప్రచారం జరిగిందో కానీ రైతులు ఆ రకం పత్తి విత్తనాలు సాగు చేసేందుకు విత్తన విక్రయ దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. తులసీ -144 BGll, కబడ్డీ ప్యాకెట్ ఎమ్మార్పీ ధర రూ.853 కాగా, వ్యాపారులు రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ప్యాకెట్ కు రూ. 1200 నుండి రూ.1350, బ్లాక్ లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని రైతులు వాపోతున్నారు.

డీలర్లు మాత్రం ఎమ్మార్పీ ధరలకే విగ్రహిస్తున్నట్టు బిల్లులు ఇస్తున్నారు. మరికొన్ని పత్తి విత్తనాలకు అధికంగా డిమాండ్ ఉండడంతో కృత్రిమ కొరత, సీడ్ ప్రోడక్ట్ తక్కువోగాని దొరకడం లేదు. ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని నిబంధనలు ఉన్నప్పటికీ గుట్టు చప్పుడు కాకుండా లోలోపల అధిక ధరలకు విక్రయిస్తున్నారని రైతులు అంటున్నారు. క్లస్టర్ పరిధిలో వ్యవసాయ విస్తీర్ణ అధికారులు ఉన్నారు. ప్రస్తుతం డిమాండ్ పలుకుతున్న విత్తనాలకు, మార్కెట్లో అందుబాటులో ఉన్న పత్తి విత్తనాలగురించి అవగాహనా కల్పించాల్సిన అవసరముంది. అదిక ధరలకు విత్తనాలు కొనుగోలు చేసి మోసపోకుండా చూడాల్సిన అవసరం సంబంధిత అధికారులు పై ఉంది.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News