బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు..
మండల కేంద్రంలోని దుబ్బగూడలో బాల్య వివాహం జరుగుతుందని ముందస్తు సమాచారం రావడంతో సోమవారం అధికారులు అడ్డుకున్నారు.
దిశ, చింతలమానేపల్లి : మండల కేంద్రంలోని దుబ్బగూడలో బాల్య వివాహం జరుగుతుందని ముందస్తు సమాచారం రావడంతో సోమవారం అధికారులు అడ్డుకున్నారు. చైల్డ్ డెవలప్మెంట్ అధికారి శ్రీనివాస్, ఎంపీడీవో మహేందర్, తహసీల్దార్ మస్కూర్ అలీ, ఎస్సై గుంపుల విజయ్, పంచాయతీ సెక్రెటరీ అసిఫ్ బాల్యం వివాహం చేస్తున్న తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
బాల్య వివాహం చేస్తే ఎన్నోసమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, అమ్మాయికి 18ఏళ్లు, అబ్బాయికి 21ఏళ్లు నిండితేనే పెళ్లి చేయాలని సూచించారు. తల్లి దండ్రుల నుండి వయస్సు నిండనిదే వివాహం చేయమని హామీ పత్రం లిఖిత పూర్వకంగా రాయించారు. ఐసీడీఎస్ సూపర్ వైజర్ విజయ లక్ష్మి, అంగన్వాడీ శ్యామల, సిబ్బంది ఉన్నారు.