ఎలాంటి ఫేక్ రూమర్స్ నమ్మొద్దు.. ఆధారాలతోనే 23 మందిని అదుపులోకి తీసుకున్నాం: నిర్మల్ జిల్లా ఎస్పీ

బైంసా లాంటి సున్నితమైన ప్రాంతంలో రెచ్చగొట్టే ఎలాంటి అసత్య ప్రచారాలు నమ్మొద్దని, గొడవలకు పోవద్దని పూర్తి పటిష్ట పోలీసు బందోబస్తులో శాంతియుతంగా బైంసా ఉందని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు.

Update: 2024-05-10 08:10 GMT

దిశ, నిర్మల్: బైంసా లాంటి సున్నితమైన ప్రాంతంలో రెచ్చగొట్టే ఎలాంటి అసత్య ప్రచారాలు నమ్మొద్దని, గొడవలకు పోవద్దని పూర్తి పటిష్ట పోలీసు బందోబస్తులో శాంతియుతంగా బైంసా ఉందని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. శుక్రవారం విలేకరులతో ఆమె మాట్లాడుతూ.. గురువారం సాయంత్రం కేటీఆర్ కార్నర్ మీటింగ్‌లో హనుమాన్ భక్తుల ఆందోళన,కేటీఆర్ వాహనం పై దాడి కేసులో 23 మందిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నామని ప్రస్తుతానికి నలుగురిపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. ఎవరైనా ఉద్రిక్త వాతావరణానికి పాల్పడిన కఠిన చర్యలు తప్పవని, ప్రజలు రూమర్స్ నమ్మక సంయమనం పాటించాలన్నారు. అయితే బీజీపీ శ్రేణులు మాత్రం ఇది అక్రమ అరెస్టులనీ వాపోతున్నారని తెలిపారు. అరెస్ట్ అయిన వాళ్లలో హనుమాన్ దీక్ష స్వాములు కూడా వున్నారని వెల్లడించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News