ఇరుకైన రోడ్లు.. ట్రాఫిక్ తిప్పలు

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మేజర్ గ్రామపంచాయతీ 2018 సంవత్సరం లో

Update: 2024-05-22 10:03 GMT

దిశ,ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మేజర్ గ్రామపంచాయతీ 2018 సంవత్సరం లో మున్సిపల్ ఏర్పాటు జరిగింది.అప్పటి నుంచి ఇప్పటివరకు ఖానాపూర్ పట్టణంలో ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికార యంత్రాంగం పట్టించుకోకుండా చూడడం విమర్శలకు దారి తీస్తోంది.ఖానాపూర్ మున్సిపాలిటీ లోని ప్రధాన రహదారి సాయి బాబా మందిరం నుంచి ఖానాపూర్ పోలీస్ స్టేషన్ వరకు రోడ్డు విస్తరణ, డివైడర్,సెంట్రల్ లైటింగ్ పనులు చేయడానికి గత ప్రభుత్వంరూ. 18 కోట్ల రూపాయలు మంజూరు చేయగా రోడ్డు విస్తరణ పనులు నత్తనడకనే జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల ముందే రోడ్డు విస్తరణ పనులు, డివైడర్ పనులు,సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చేస్తామని గత ప్రభుత్వం చెప్పిన ఇంతవరకు పనులు జరగక ఎక్కడి వేసిన గొంగడి అక్కడే అనే సమేత గా ఉంది.సాయిబాబా మందిరం నుంచి జూనియర్ కాలేజ్ వరకు విస్తరణ పనులు కొసమెరుపు గా జరిగాయి.జూనియర్ కాలేజీ నుండి తెలంగాణ చౌరస్తా మీదిగా పోలీస్ స్టేషన్ వరకు జరగాల్సిన రోడ్డు విస్తరణ,డివైజడ్,సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తిగా ఆగిపోయాయి.

ఇరుకైనా రోడ్లు ఉన్న ఖానాపూర్ మీదిగా మంచిర్యాల, జగిత్యాల,కరీంనగర్ నిర్మల్ జిల్లాలకు నిత్యం బారి వాహనాలు వెళ్తూ వుంటాయి.రోడ్డు విస్తరణ లేక ట్రాఫిక్ సమస్య ఉన్న ఒక పక్క ఇరుకైనా రోడ్డుపైనే చిరు వ్యాపారులు వ్యాపారాలు చేస్తున్నారు.అంతే కాకుండ రోడ్డుపక్కనే వాహనాలు నిలపడంతో వాహనాలు దారులు ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యాపార సముదాయం యగు ప్రధాన గుడాలలోని తెలంగాణ చౌరస్తా, వివేకానంద చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తాలో ఇరుకైనా రోడ్లు వుండడంతో రోజు రోజుకు ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలపై అధికారులు దృష్టి సరించకపోవడంతో ట్రాఫిక్ సమస్య జట్టీలమౌతుంది.ఇప్పటికైనా ఆగిపోయిన రోడ్డు విస్తరణ పనులు,డివైడర్ పనులు,సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చేసి ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని,రోడ్లపై ఉన్న ఆక్రమణలను తొలిగించాలని,ట్రాఫిక్ సమస్య ఉన్న ప్రధాన గుడాలలో పోలీస్ శాఖ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని పట్టణవాసులు,వాహనదారులు కోరుతున్నారు.

ప్రభుత్వం వెంటనే రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలి : సీపీఐ (ఎంఎల్)మాస్ లైన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి నంది రామయ్య

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఖానాపూర్ పట్టణం మున్సిపాలిటీ గా ఏర్పడి ఐదు సంవత్సరాలు అయిన రోడ్డు విస్తరణ, డివైజడ్ ,సెంట్రల్ లైటింగ్ పనులు అసెంబ్లీ ఎన్నికల ముందే పూర్తి చేస్తామని గత ప్రభుత్వం చెప్పిన ఇంతవరకు రోడ్డు విస్తరణ పనులు పూర్తి కాలేదు.ప్రభుత్వలు మారిన విస్తరణ పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే మిగిలిపోయింది అని అన్నారు. పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయాలని ఆయన అన్నారు.

Similar News