జర్నలిస్టుల పై దాడులు ఎంతవరకు సమంజసం.. ఏఐసీసీ సభ్యులు నరేష్ జాధవ్..

: వాస్తవ నేస్తం దిన పత్రిక ఎండీ, సీఈవో సయ్యద్ ఖమర్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ కొత్తూరి లక్ష్మణ్ పై అధికార పార్టీకి చెందిన ఇచ్చోడ ఎంపీపీ నిమ్మల ప్రీతం రెడ్డి దాడి చేసి, కులం పేరుతో దూషించడం ఎంత వరకు సమంజసమని ఏఐసీసీ సభ్యులు నరేష్ జాధవ్ అన్నారు.

Update: 2023-03-05 11:42 GMT

దిశ, ఇచ్చోడ : వాస్తవ నేస్తం దిన పత్రిక ఎండీ, సీఈవో సయ్యద్ ఖమర్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ కొత్తూరి లక్ష్మణ్ పై అధికార పార్టీకి చెందిన ఇచ్చోడ ఎంపీపీ నిమ్మల ప్రీతం రెడ్డి దాడి చేసి, కులం పేరుతో దూషించడం ఎంత వరకు సమంజసమని ఏఐసీసీ సభ్యులు నరేష్ జాధవ్ అన్నారు. ఎంపీపీ అతని అనుచరులు చేసిన దాడిలో కంటికి గాయమై, హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకొని ఇంటికి వచ్చిన సయ్యద్ ఖమర్ ను ఆదివారం ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరామర్శించారు.

జర్నలిస్టుల పై దాడిని ఆయన ఖండించారు. ఆయన వెంట నాయకులు జాదవ్ వసంత్ రావు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆసిఫ్ ఖాన్, గుడిహాత్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్యాల కరుణాకర్, బోథ్ నియోజ వర్గ మైనార్టీ చైర్మన్ ఎండీ ముస్తఫా, కాంగ్రెస్ నాయకులు ఖలీద్ (జాంటి), శివాజీ, నౌషాద్, తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News