ప్రతి కేసులో విచారణ పారదర్శకంగా చేపట్టాలి : జిల్లా ఎస్పీ

ప్రతి కేసులో విచారణ పారదర్శకంగా చేపట్టాలని జిల్లా ఎస్పీ

Update: 2024-05-22 13:08 GMT

దిశ,ఆసిఫాబాద్ : ప్రతి కేసులో విచారణ పారదర్శకంగా చేపట్టాలని జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ పోలిస్ అధికారులను ఆదేశించారు.బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు స్టేషన్ లో ఎలాంటి కేసులు పెండింగ్ లేకుండా చూడాలన్నారు.

స్టేషన్ రికార్డ్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచించారు. నేర నియంత్రణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ప్రజలను ప్రోత్సహించాలని చెప్పారు.అలాగే బాల్య వివాహాలు, సైబర్ నేరాలు. డ్రగ్స్. ఎలోప్మెంట్. కల్తీ విత్తనాలు విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. అలాగే వీటి పట్ల గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనంతరం పార్లమెంట్ ఎన్నికల విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సీఐలు శ్రీనివాస్. రాంబాబు. శంకరయ్య. ఎస్ఐలు డీ రమేష్. విజయ్ లకు ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేశారు.

Similar News