ఉచిత న్యాయపరమైన సేవలను సద్వినియోగం చేసుకోవాలి..

ఉచిత న్యాయపరమైన సేవలను, సలహాలను మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తహసిల్దార్ సంధ్యారాణి అన్నారు.

Update: 2023-02-06 13:32 GMT

దిశ, గుడిహత్నూర్ : ఉచిత న్యాయపరమైన సేవలను, సలహాలను మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తహసిల్దార్ సంధ్యారాణి అన్నారు. మండల కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీలో సోమవారం ఉచిత న్యాయసలహా కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. మండల కేంద్రానికి చెందిన న్యాయవాది జోందళే అజయ్ కుమార్ ఉచిత న్యాయసలహా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ ఆర్థికలేమి కారణంగా న్యాయాన్ని కోల్పోతున్న వారికి న్యాయ సలహాలను ఇస్తూ వారి సమస్యలకు పరిష్కారం చూపే దిశగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పతంగే బ్రహ్మానంద్, సర్పంచ్ జాదవ్ సునీత, ఎస్సై ఎల్.ప్రవీణ్, సహకార సంఘ చైర్మన్ ముండే సంజీవ్ కుమార్, ఏఎస్సై రహమాన్ ఖాన్, భారాస నాయకులు జాదవ్ రమేష్, మాధవ్ కేంద్రే, సలీంఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Similar News