ఏసీబీ వలకి చిక్కిన మ‌హిళా ఎస్ఐ..

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ ఎస్ఐ లంచం తీసుకుంటూ

Update: 2024-04-15 09:26 GMT

దిశ‌, ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ ఎస్ఐ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఆసిఫాబాద్ ఎస్ఐ రాజ్య‌ల‌క్ష్మి ఓ కేసు విష‌యంలో లంచం తీసుకుంటుండ‌గా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఓ ప్ర‌మాదం కేసులో స్టేష‌న్ బెయిల్ ఇవ్వ‌డానికి, వాహ‌నం రిలీజ్ చేసేందుకు ఆమె రూ. 25 వేలు లంచం డిమాండ్ చేశారు. డిమాండ్ చేసిన 25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వ‌ర్యంలో వ‌ల‌ప‌న్ని ప‌ట్టుకున్న అధికారులు ఆమెను విచారిస్తున్నారు.

Similar News