ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలు గొప్పవి : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ఆదివాసీ గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ఎంతో గొప్పవని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.

Update: 2024-05-24 13:11 GMT

దిశ, ఖానాపూర్:- ఆదివాసీ గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ఎంతో గొప్పవని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఉట్నూర్ మండలంలోని కొత్తగూడా గ్రామంలో శుక్రవారం రోజున 'భావె మహినా' కార్యక్రమం సందర్భంగా ఆత్రం పరివార్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ పాల్గొని పెర్సపెన్ లకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఆదివాసీలు ప్రకృతిని దైవంగా భావించి ఎంతో నియమ నిష్టలతో పూజలు చేసి తమ సంస్కృతి సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను యావత్ ప్రపంచానికి చాటి చెప్పడం జరుగుతుందని పేర్కొన్నారు. నేటి యువత సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోతున్నారు అని ,తమ ముత్తాతల కాలం నుంచి ఆచరిస్తున్న సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఎంతైన ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్రం కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Similar News