రైతులకు, అటవీ శాఖ అధికారులకు వాగ్వివాదం

కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం అంకుసపూర్ గ్రామంలో శుక్రవారం గ్రామస్తులు అటవీ భూమిని సాగు చేస్తున్నారని సమాచారంతో అంకుశ పూర్ గ్రామానికి చేరుకున్న అటవీ అధికారులకు మధ్య వాగ్వివాదం నెలకొంది.

Update: 2024-05-24 10:19 GMT

దిశ, కాగజ్ నగర్ : కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం అంకుసపూర్ గ్రామంలో శుక్రవారం గ్రామస్తులు అటవీ భూమిని సాగు చేస్తున్నారని సమాచారంతో అంకుశ పూర్ గ్రామానికి చేరుకున్న అటవీ అధికారులకు మధ్య వాగ్వివాదం నెలకొంది. గత 40 సంవత్సరాలుగా సర్వేనెంబర్ 145 లో గ్రామస్తులు భూములను సాగు చేసుకుంటున్నామని, ఈ భూములు మాకు పట్టాలు కూడా ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. బ్యాంకు రుణాలు, రైతుబంధు కూడా వర్తిస్తున్నాయని రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు.

అటవీ అధికారులు అత్యుత్సాహం చూపిస్తూ ప్రతి సంవత్సరం ఖరీఫ్ సీజన్ సమయం లో దుక్కులు దున్నే సమయంలోనే తమను అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ను దిశ వివరణ కోరగా గతంలో రెవెన్యూ, అటవీ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న భూములు సమస్యలు పరిష్కారం కాకుండానే ఉన్నాయని అంకుస పూర్ గ్రామంలో ఫారెస్ట్ కంపార్ట్మెంట్ నెంబర్ 69లో 60 నుండి 70 ఎకరాల విస్తీర్ణంలో ఫారెస్ట్ భూములు ఉన్నాయన్నారు. రైతుల మీదికి దాడి యత్నించే ప్రయత్నాలు మేము ఎప్పుడూ చేయలేదన్నారు. 40 సంవత్సరాలుగా ఇక్కడి రైతులు సాగు చేస్తున్నారని చెబుతున్న మాట అబద్దమన్నారు.

పది సంవత్సరాలుగా ఈ భూములను ఇక్కడి రైతులు అటవీ భూములను బాగు చేస్తున్నారని అటవీ భూమి చుట్టూ ఉన్న ట్రెంచ్ వద్ద ఉన్న అటవీ భూముల కు ఆధారాలు ఉన్నాయన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లు నాటే కార్యక్రమంలో ప్లాంటేషన్ కొరకు భూమిని పరిశీలించేందుకు వెళ్లడంతో రైతులు మాపై లేనిపోని మాటలు చెబుతున్నారని అన్నారు. ఫారెస్ట్ భూముల్లో రైతులు సాగు చేస్తే తగ్గే ప్రసక్తే లేదన్నారు. పోడు భూముల విషయంలోనే గతంలో బీట్ ఆఫీసర్ కూడా సస్పెండ్ అయ్యాడని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళుతున్నట్లు తెలిపారు. డి.ఆర్.ఓ వెంట బీట్ ఆఫీసర్ నవ్యశ్రీ, అటవీ శాఖ అధికారులు ఉన్నారు.

Similar News