సిబ్బంది లంచం అడిగితే మా దృష్టికి తీసుకు రండి : మున్సిపల్ వైస్ చైర్మన్

అకారణంగా ఎవరైనా సిబ్బంది బిల్లులు అధికంగా వేసి, లంచం అడిగినట్లు సంఘటన చోటు చేసుకుంటే తమకు సమాచారం అందించవలసిందిగా మున్సిపల్ వైస్ చైర్మన్ జాబిర్ హైమాద్ అన్నారు.

Update: 2024-05-23 12:16 GMT

దిశ,భైంసా : అకారణంగా ఎవరైనా సిబ్బంది బిల్లులు అధికంగా వేసి, లంచం అడిగినట్లు సంఘటన చోటు చేసుకుంటే తమకు సమాచారం అందించవలసిందిగా మున్సిపల్ వైస్ చైర్మన్ జాబిర్ హైమాద్ అన్నారు. గురువారం బైంసా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు... బుధవారం ఏసీబీ దాడులలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, బిల్ కలెక్టర్ సాగర్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డరన్న విషయం తెలిసిందన్నారు. మున్సిపల్ సిబ్బందిలో కొందరు గైహాజరు గా ఉన్న, వారి అటెండెన్స్ నింపి డబ్బులు తీసుకున్న సంఘటనలు కొన్ని తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు.

Similar News