నూతన చట్టాలపై అవగాహన పెంచుకోవాలి : జిల్లా ఎస్పీ

దేశంలో నూతనంగా రూపొందించిన మూడు చట్టాల పై పోలీస్

Update: 2024-05-27 10:19 GMT

దిశ, ఆసిఫాబాద్ : దేశంలో నూతనంగా రూపొందించిన మూడు చట్టాల పై పోలీస్ సిబ్బంది పూర్తి అవగాహన పెంచుకోవాలని జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బందికి కొత్త చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం 2023లో ఈ మూడు చట్టాలు భారత శిక్షాస్మృతి ఐపీసీ 1860 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సీఆర్ పీసీ 1973, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 లను రీప్లేస్ చేయనున్నాయి. ఈ నూతన క్రిమినల్ చట్టాలలో సమకాలీన కాలం వాడుకలో ఉన్న సాంకేతికత లకు అనుగుణంగా అనేక కొత్త నిబంధనలను చేర్చడం జరిగిందని పేర్కొన్నారు. నేరస్థులకు శిక్షించడం తో పాటు బాధితులకు న్యాయం పొందేలా చట్టాలను రూపొందించి నట్లు. చట్టాలపై అవగాహన పెంచుకుని వినియోగించుకోవాలని పోలీస్ అధికారుల కు ఎస్పీ సూచించారు.

Similar News