అటవీ శాఖ అధికారులపై దాడి…పోడు దారులకు అధికారులు మధ్య తీవ్ర వాగ్వాదం

కొమురం భీం అసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం తుంగెడ అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులకు, పోడు దారులకు మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Update: 2024-05-10 09:51 GMT

దిశ, ఆసిఫాబాద్ : కొమురం భీం అసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం తుంగెడ అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులకు, పోడు దారులకు మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తుంగెడ గ్రామంలో కొందరు అక్రమంగా కొత్త పోడు చేస్తున్న వారిని అడ్డుకోవడానికి వెళ్లిన అటవీ అధికారులు పై దాడికి పాల్పడ్డారు. పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా స్థానికులతో పాటు గ్రామస్థులు ఏకమై అధికారులతో వాగ్వాదం దిగారు.

కొందరు గొడ్డళ్లు, కర్రలు, రాళ్లతో దాడికి యత్నించగా తప్పించుకున్నట్లు అటవీ శాఖ అధికారులు ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో కొత్త పోడు చేయొద్దని, కలెక్టర్, తహసీల్దార్ తో మాట్లాడిన తర్వాత చేయొచ్చు అని వారికి చెప్పినా పట్టించుకోకుండా… కనీసం తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కొత్త పోడు చేస్తున్నారని అడ్డుకునేందుకు వెళ్లిన తమపై దాడికి దిగారని అటవీశాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.

విషయం తెలుసుకున్న ఎఫ్ఆర్వో అప్పల కొండ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్థులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. మరోవైపు రైతులు మాత్రం 30 ఏళ్లుగా ఈ భూములను తాము సాగు చేస్తున్నామని, భూమి సంబంధించిన పట్టాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఫారెస్ట్ అధికారులే తమ పై దాడికి పాల్పడ్డారని, జిల్లా స్థాయి అధికారులు దీనిపై విచారణ జరిపి తమకు తగు న్యాయం చేయాలని కోరారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News