కలుషిత బావి నీరు తాగి 15 మందికి అస్వస్థత

ఆదిలాబాద్ జిల్లాలోని గాదిగూడ మండలం లో లోకారి (B) గ్రామంలో కలుషితమైన బావి నీరు తాగి (15) మంది గ్రామస్తులు అస్వస్థతకు గురైయ్యారు.

Update: 2024-05-24 13:15 GMT

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలోని గాదిగూడ మండలం లో లోకారి (B) గ్రామంలో కలుషితమైన బావి నీరు తాగి (15) మంది గ్రామస్తులు అస్వస్థతకు గురైయ్యారు. స్థానికులు వెంటనే 108 వాహన సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు గ్రామానికి చేరుకొని అస్వస్థతకు గురైన 15 మందిని ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అంతకుముందు 108 వాహన సిబ్బంది ప్రథమ చికిత్స అందించి, అనంతరం రిమ్స్ కి తరలించారు. రిమ్స్ ఆస్పత్రిలో రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, వైద్యులు బాధితులకు చికిత్స అందిస్తున్నారు.అయితే బాధితుల పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని అన్నారు.

Similar News