అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి!.. బండి సంజయ్ డిమాండ్

కరీంనగర్ లో అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, అరెస్ట్ చేసిన దీక్షా స్వామీజీలను వెంటనే విడుదల చేయాలని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్ధి బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Update: 2024-05-26 07:08 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కరీంనగర్ లో అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, అరెస్ట్ చేసిన దీక్షా స్వామీజీలను వెంటనే విడుదల చేయాలని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్ధి బండి సంజయ్ డిమాండ్ చేశారు. శనివారం రాత్రి సమయంలో కరీంనగర్ లో జరిగిన సంఘటనపై వీడియో విడుదల చేసిన ఆయన హనుమాన్ దీక్షా స్వాములపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడాన్ని ఖండించారు. సంఘటనకు సంబందించిన వీడియోలను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్ లో హనుమాన్ దీక్షా స్వాముల ర్యాలీ సందర్భంగా ఓ వ్యక్తి తల్వార్ తిప్పుతూ.. వేరే విధంగా ప్రవర్తించడంతో స్వామీజీలు ఆ వ్యక్తిని అడ్డకునే ప్రయత్నం చేశారని అన్నారు.

ఇంతలో అక్కడికి వచ్చిన పోలీసులు సంమయమనంతో సమస్యను పరిష్కరించాల్సింది పోయి స్వాముల పట్ల దురుసుగా ప్రవర్తించారని, స్వాములనే అరెస్ట్ చేసి తీసుకెళ్లే క్రమంలో ఓ స్వామి డోర్ పట్టుకొని ఉన్నా పోలీస్ వాహానాన్ని స్పీడ్ గా తీసుకెళ్లారని తెలిపారు. గొడవ జరినప్పుడు సంయమనం పాటించకుండా రెచ్చగొట్టే ప్రయత్నం చేసి స్వామీజీలను అరెస్ట్ చేశారని, పైగా స్వామీజీలు బూతులు మాట్లాడినట్లు చెబుతున్నారని అన్నారు. మీ పని శాంతిభద్రతలను నిర్వహించడం, సమస్యలను సృష్టించడం కాదు అని చెప్పారు. తెలంగాణ డీజీపి, కరీంనగర్ పోలీసులు శాంతిభద్రతలను కాపాడకుండా ప్రజలపై లాఠీచార్జి చేస్తున్నారని, దయచేసి వాస్తవాలను గుర్తించి, తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే అరెస్ట్ చేసిన హనుమాన్ దీక్షా స్వామీజీలను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.  


Similar News