గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ క్యాంపెయిన్‌లో ట్విస్ట్.. ఆ పార్టీ అభ్యర్థికి మద్దతు పలికిన జేడీ లక్ష్మీనారాయణ

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ముందు వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది.

Update: 2024-05-22 12:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ముందు వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో గెలిచి తమ ఉనికి చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు గెలుపే లక్ష్యంగా ముందుకు కదులుతున్నాయి. అయితే, 2021లో ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లా గెలుపొందారు దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే, వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో మొత్తం 52 మంది పోటీలో ఉన్నారు. అధికార కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ తరఫున ఏనుగుల రాకేష్ రెడ్డి బరిలో ఉన్నారు.

ఈ క్రమంలోనే ఎలక్షన్ క్యాంపెయిన్‌లో భాగంగా బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్‌రెడ్డికి సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ తన మద్దతును ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ‘రాజకీయాల్లో యువతరాన్ని, నీతి, నిజాయితీ ఉన్నవారు రావలని కోరుకుంటున్నా. ఓ వ్యాపారంలో వ్యక్తి నష్టపోతే.. ఆయన కొంతమంది నష్టపోవచ్చని అన్నారు. కానీ, రాజకీయాల్లోకి మోసగాళ్లు, స్వార్థపరులు, అవినీతి చేసే వాళ్లు వస్తే సమాజానికే చెడు అవుతుందని అన్నారు. సమాజం కోసం నిలబడి పనిచేసే మంచి నాయకులు, యువతరం ఇప్పుడు అవసరం. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల అభ్యర్థిగా తన మిత్రుడు ఏనుగుల రాకేష్‌రెడ్డిని గెలిపించాలి’ అంటూ ఓటర్లను అభ్యర్థించారు.

Tags:    

Similar News