Telangana Secretariat: కావాలనే వారికి కుర్చీలు వేయలేదా?

రాష్ట్ర సచివాలయంలోని హెల్త్ సెక్రటరీ పేషీలో విచిత్ర పరిస్థితి నెలకొన్నది. నిత్యం రివ్యూలు, మీటింగ్‌లు, సబ్జెక్ట్ డిస్కషన్స్‌కు వచ్చే వివిధ విభాగాల హెచ్‌వోడీలకు కనీసం కూర్చునే పరిస్థితి లేదు.

Update: 2024-05-24 14:10 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర సచివాలయంలోని హెల్త్ సెక్రటరీ పేషీలో విచిత్ర పరిస్థితి నెలకొన్నది. నిత్యం రివ్యూలు, మీటింగ్‌లు, సబ్జెక్ట్ డిస్కషన్స్‌కు వచ్చే వివిధ విభాగాల హెచ్‌వోడీలకు కనీసం కూర్చునే పరిస్థితి లేదు. ఈ పేషీలో అధికారులు కుర్చునేందుకు ఎలాంటి సౌకర్యాలు లేకపోవడం విస్మయానికి గురి చేస్తోన్నది. వైద్యారోగ్యశాఖకు సంబంధించిన ఏ హెచ్‌వోడీ వచ్చినా, పేషీలో నిలబడి వెయిట్ చేయాల్సిందే. మేడం అనుమతి వచ్చేవరకు ఎంత సేపైనా అక్కడే నిల్చొని వెయిట్ చేయాల్సిందే. దీన్ని గమనించిన ఇతర శాఖ ఉద్యోగులు షాక్‌కు గురవుతున్నారు. కావాలనే కూర్చీలు వేయలేదా? లేక చైర్లు లేవని ఏర్పాటు చేయాలేదా? అనే చర్చ మొదలైనది. తమ ఉన్నతాధికారులు నిలబడి ఉండటాన్ని గమనిస్తున్న ఆయా విభాగాల ఉద్యోగులూ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. విక విజిటర్ల పరిస్థితి మరింత ఆధ్వాన్నంగా మారింది. ఇలాంటి పరిస్థితి ఏ ఛాంబర్లలో లేవని సెక్రటేరియట్‌కు చెందిన కొందరు ఉద్యోగులు వాపోతున్నారు. మేడం చెప్పనిది తామేమీ చేయలేమని హెల్త్ సెక్రటరీ పేషీ స్టాఫ్​చెప్పడం విశేషం.

వాస్తవానికి వైద్యారోగ్యశాఖ ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్. రౌండ్ ది క్లాక్ పనిచేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఎక్కువ మంది ఎంప్లాయూస్ కలిగిన శాఖల్లో ఇది కూడా ఒకటి. దీంతో సహజంగానే వివిధ రకాల సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. వీటిని పరిష్కారం చేసేందుకు పబ్లిక్, ఇతర ఆఫీసర్లు హెల్త్ సెక్రటరీ పేషీకి వస్తుంటారు. అంతేగాక వైద్యారోగ్యశాఖకు చెందిన పబ్లిక్ హెల్త్, డైరెక్టర్ ఆఫ్​మెడికల్ ఎడ్యుకేషన్, నేషనల్ హెల్త్ మిషన్, టీవీవీపీ, డ్రగ్ కంట్రోల్, తదితర విభాగాల హెచ్‌వోడీలు రెగ్యులర్‌గా ఈ పేషీకి రావాల్సి ఉంటుంది. కానీ అక్కడ కనీస సౌకర్యాల కూడా ఏర్పాటు చేయకపోవడంతో అధికారులు షాక్‌కు గురవుతున్నారు. ఇక హెల్త్ సెక్రటరీకు కేటాయించిన ఛాంబర్ అతి చిన్నగా ఉండటంతోనే ఇలాంటి పరిస్థితి ఉన్నదని ఓ ఉద్యోగి తెలపడం గమనార్హం.

Tags:    

Similar News