మంచిర్యాల మున్సిపల్ కమిషనర్‌పై కేసు నమోదు

మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ భార్య జ్యోతి ఆత్మహత్య కేసులో భర్త, మున్సిపల్ కమిషనర్‌పై కేసు నమోదైంది.

Update: 2023-02-08 07:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ భార్య జ్యోతి ఆత్మహత్య కేసులో ట్విస్ట్ నెలకొంది. ఎంతో అన్యోన్యంగా ఉంటున్న కుటుంబంలో హఠాత్తుగా జ్యోతి ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గతంలో పోలీస్ శాఖలో పని చేసిన బాలకృష్ణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి మున్సిపల్ శాఖలో కమిషనర్ అయ్యారు. మంచిర్యాలలోని మేదరివాడ ఆదిత్య ఎంక్లేవ్‌లో కమిషనర్ కుటుంబం నివాసం ఉంటుంది. ఈ క్రమంలో నిన్న సాయంత్రం భర్త ఆఫీసులకు వెళ్లిన తర్వాత జ్యోతి ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, కూతురు మరణ వార్త తెలుసుకున్న జ్యోతి కుటుంబ సభ్యులు హుటాహుటిన మంచిర్యాలకు చేరుకున్నారు. తన అల్లుడు, నిర్మల్ మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ నిత్యం వరకట్నం కోసం వేధింపులకు గురి చేసేవాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. జ్యోతి ఆత్మహత్యపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణపై వరకట్న వేధింపులు, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన రెండు ఫోన్లను సీజ్ చేశారు. పోలీసుల విచారణలో ఇంకా ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. 

Tags:    

Similar News