పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం..

రాబోయే ఎన్నికల్లో పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అన్నారు.

Update: 2023-04-19 14:33 GMT

దిశ, దేవరుప్పుల : రాబోయే ఎన్నికల్లో పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అన్నారు. బుధవారం నియోజవర్గంలోని అన్ని మండలాల ముఖ్య నాయకులు హైదరాబాద్ లోని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదగా కలిసి పుష్పగుచ్చాన్ని అందించి శాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గానికి అభ్యర్థిని నియమించి పాత కమిటీలను రద్దుచేసి కొత్త కమిటీలను వేయాలని కోరారు.

పాలకుర్తి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధైర్య పడొద్దని అతితొందరలో పాలకుర్తి నియోజకవర్గానికి అభ్యర్థిని నియమిస్తానని రేవంత్ రెడ్డి తెలిపినట్లువారన్నారు. నియోజకవర్గంలోని పార్టీ స్థితిగతులు పలుసమస్యలను రేవంత్ రెడ్డికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్ జనగామ జిల్లా అధ్యక్షులు నల్ల శ్రీరామ్, జిల్లా నాయకులు అల్లం ప్రదీప్ రెడ్డి, కాసారపు ధర్మారెడ్డి, కాసాని ఎర్రయ్య, గండిపెల్లి యాకయ్య, నారెడ్డి సైదులు రెడ్డి నియోజక వర్గంలోని ఆయా మండలాల ముఖ్యనాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News