ఏపీ వైపు మళ్లిన తెలంగాణ రాజకీయం
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయం ఇప్పుడు ఏపీ వైపు మళ్లింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేసిన ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. కేటీఆర్ ప్రకటనపై విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేయగా.. తెలంగాణ రాజకీయ నేతలు మాత్రం విమర్శలు చేస్తున్నారు. తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో సెటిలర్స్ గ్రాడ్యుయేట్స్ ఓట్ల కోసం కేటీఆర్ డ్రామాలాడుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, […]
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయం ఇప్పుడు ఏపీ వైపు మళ్లింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేసిన ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. కేటీఆర్ ప్రకటనపై విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేయగా.. తెలంగాణ రాజకీయ నేతలు మాత్రం విమర్శలు చేస్తున్నారు.
తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో సెటిలర్స్ గ్రాడ్యుయేట్స్ ఓట్ల కోసం కేటీఆర్ డ్రామాలాడుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ ఇలా డ్రామాలాడటం మానుకోవాలని రేవంత్ సూచించారు.
ఇక కేటీఆర్ ప్రకటనపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్‌పై ఉన్న ప్రేమ కేటీఆర్‌కు రైతులపై ఎందుకు లేదని విమర్శించారు. రైతు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఎందుకు పోరాడటం లేదని విమర్శించారు.