ఏపీ రాజధానిపై తెలంగాణ మంత్రి ఏమన్నారంటే..

దిశ,వెబ్ డెస్క్: బీజేపీవి టెంపరరీ పాలిటిక్స్ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బెజవాడ దుర్గమ్మను ఆయన శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…బీజేపీ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఏ మాత్రం ఉండదని అన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన నేతల మాటలు చెల్లవని చెప్పారు. అమరావతిలో కాలయాపనతో ఏం జరిగిందో అందరికీ తెలుసని పేర్కొన్నారు. రియాల్టీ ఉండాలి…గ్రాఫిక్స్ కాదని అన్నారు. ఏపీ ప్రతి పక్షాల ఉద్యమాలపై తాను మాట్లాడటం సరికాదనీ…ఇది ఏపీ ఇష్యూ అని […]

Update: 2020-12-19 06:23 GMT

దిశ,వెబ్ డెస్క్: బీజేపీవి టెంపరరీ పాలిటిక్స్ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బెజవాడ దుర్గమ్మను ఆయన శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…బీజేపీ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఏ మాత్రం ఉండదని అన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన నేతల మాటలు చెల్లవని చెప్పారు. అమరావతిలో కాలయాపనతో ఏం జరిగిందో అందరికీ తెలుసని పేర్కొన్నారు. రియాల్టీ ఉండాలి…గ్రాఫిక్స్ కాదని అన్నారు. ఏపీ ప్రతి పక్షాల ఉద్యమాలపై తాను మాట్లాడటం సరికాదనీ…ఇది ఏపీ ఇష్యూ అని వెల్లడించారు. అమరావతి రాజధానిపై ప్రస్తుత ప్రభుత్వం దీర్ఘకాలికంగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్టు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News