టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై మేడిపల్లి పీఎస్‌లో ఫిర్యాదు

దిశ, డైనమిక్ బ్యూరో : మంత్రి కేటీఆర్‌ తనయుడు హిమాన్షుపై బీజేపీ నేత, తీన్మార్ మల్లన్న తన ట్విట్టర్ అకౌంట్లో విమర్శించాడంటూ టీఆర్ఎస్ నేతలు గత రెండు రోజులుగా విమర్శలకు దిగుతున్నారు. ఈ క్రమంలో తీన్మార్ మల్లన్నపై కేటీఆర్ అభిమానులు దాడికి దిగిన వీడియోలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంపై టీఆర్ఎస్ బోధన్ ఎమ్మెల్యే షకీల్ తీవ్రంగా స్పందిస్తూ మల్లన్నను ముక్కలుగా నరికేస్తానని హెచ్చరించారు. ఈ క్రమంలో తీన్మార్ మల్లన్న దీనిపై […]

Update: 2021-12-27 09:00 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : మంత్రి కేటీఆర్‌ తనయుడు హిమాన్షుపై బీజేపీ నేత, తీన్మార్ మల్లన్న తన ట్విట్టర్ అకౌంట్లో విమర్శించాడంటూ టీఆర్ఎస్ నేతలు గత రెండు రోజులుగా విమర్శలకు దిగుతున్నారు. ఈ క్రమంలో తీన్మార్ మల్లన్నపై కేటీఆర్ అభిమానులు దాడికి దిగిన వీడియోలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంపై టీఆర్ఎస్ బోధన్ ఎమ్మెల్యే షకీల్ తీవ్రంగా స్పందిస్తూ మల్లన్నను ముక్కలుగా నరికేస్తానని హెచ్చరించారు. ఈ క్రమంలో తీన్మార్ మల్లన్న దీనిపై స్పందిస్తూ.. షకీల్, ఆయన అనుచరుల నుంచి ప్రాణాపాయం ఉందని మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు. మీడియా ముందే తనను మూడు ముక్కలుగా నరుకుతా అన్న షకీల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News