గూగుల్ మ్యాప్స్‌లో అంత స్వీట్‌గా వచ్చే మహిళ వాయిస్ ఎవరిదో తెలుసా?

ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు టెక్నాలజీ పూర్తిగా మారిపోయింది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు చాలా సమస్యలకు అదే పరిష్కారం చూపుతుంది. మరీ ముఖ్యంగా మనం ఎక్కడికైనా వెళ్లాలి అన్నా లేదా, తెలియని ప్రదేశాన్ని కూడా చూసి రావడం

Update: 2024-05-24 08:22 GMT

దిశ, ఫీచర్స్ : ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు టెక్నాలజీ పూర్తిగా మారిపోయింది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు చాలా సమస్యలకు అదే పరిష్కారం చూపుతుంది. మరీ ముఖ్యంగా మనం ఎక్కడికైనా వెళ్లాలి అన్నా లేదా, తెలియని ప్రదేశాన్ని కూడా చూసి రావడం చాలా ఈజీ అయిపోయింది. అంతే కాకుండా ఒక వేళ మనం రాంగ్ రూట్‌లో వచ్చి తెలియని ప్రదేశంలో ఉన్నా.. మనం ఎక్కడున్నాం అని చూసుకోవడం.. మనం వెళ్లే గమ్యం ఎంత దూరం ఉంది అని తెలుసుకోవడం చాలా తేలిక అయిపోయింది. ఈ గూగుల్ మ్యాప్ ద్వారా మనం ఎక్కడ ఉన్నాం అనేది తెలుసుకోవడమే కాకుండా.. మనకు తెలియని విలేజ్‌కు కూడా ఈజీగా చేరుకోగలుగుతున్నాం. అందు వలన ప్రతి ఒక్కరూ ఈ గూగుల్ మ్యాప్స్‌ను ఉపయోగిస్తూ తమ గమ్మాన్ని ఈజీగా చేరుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి ఫోన్‌లో ఇది తప్పకుండా ఉంటుంది.

అయితే మనం గూగుల్ పే యాప్ ఓపెన్ చేయగానే ఓ అమ్మాయి స్వీట్ వాయిస్ మనల్ని ఆకట్టుకుంటుంది. తాను ఇన్ స్ట్రక్షన్స్ ఇస్తూ మనకు మార్గం చూపెడుతుంది. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఆ వాయిస్ ఎవరిది అని? అయితే దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఆ స్వీట్ వాయిస్ ఎవరిదో కాదు. ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తిదంట. ఆమె పేరు కరెన్ జాకబ్సన్. ప్రస్తుతం ఈమె న్యూయర్క్‌లో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. కరెన్ వాయిస్ ఓ వర్ ఆర్టిస్ట్ అంట. ఈమె తన వాయిస్ ద్వారా ఎన్నో అవార్డ్స్ సొంత చేసుకున్నదంట. ఇక గూగుల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈమె వాయిస్ తప్పకుండా వింటారు

Similar News