ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి Vivo 5G స్మార్ట్ ఫోన్

Vivo కంపెనీ నుంచి భారత మార్కెట్లోకి కొత్తగా స్మార్ట్ ఫోన్ రానుంది. ఈ మోడల్ పేరు ‘Vivo T2 5G’.

Update: 2023-04-10 10:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: Vivo కంపెనీ నుంచి భారత మార్కెట్లోకి కొత్తగా స్మార్ట్ ఫోన్ రానుంది. ఈ మోడల్ పేరు ‘Vivo T2 5G’. ఇది ఏప్రిల్ 11న విడుదల కానుంది. ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, ఫోన్ పూర్తి-HD+ AMOLED డిస్‌ప్లే, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 రన్ అవుతుందని సమాచారం. అలాగే, స్నాప్‌డ్రాగన్ 695 5G SoC ద్వారా పనిచేస్తుంది. ఫొటోలు, వీడియోల కోసం 64-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు, 2MP కెమెరా ఉండే అవకాశం ఉంది. సెల్ఫీల కోసం ముందు 16MP కెమెరా ఉండనుంది. బ్యాటరీ పరంగా 4700mAh ని అందించినట్లు సమాచారం. ఇతర పూర్తి వివరాలు లాంచ్ టైంలో తెలుస్తాయి.




Tags:    

Similar News