The Nothing Phone 2:ఎట్టకేలకు ఇండియాలోకి నథింగ్ ఫోన్ 2..లాంచ్ తేదీ ఇదే

UK-ఆధారిత స్మార్ట్ ఫోన్ కంపెనీ నథింగ్ ఫోన్ 2 గురించి కీలక సమాచారాన్ని కంపెనీ మంగళవారం పేర్కొంది.

Update: 2023-06-13 14:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: UK-ఆధారిత స్మార్ట్ ఫోన్ కంపెనీ నథింగ్ ఫోన్ 2 గురించి కీలక సమాచారాన్ని కంపెనీ మంగళవారం పేర్కొంది. ఈ ఫోన్ జులై 11న ఇండియాలో లాంచ్ అవుతుందని కంపెనీ తన బ్లాగ్ సైట్‌లో ప్రకటించింది. ఈ లాంచ్ ఈవెంట్‌ను జులై 11 రాత్రి 8:30 నుంచి కంపెనీ వెబ్‌సైట్‌తో పాటు కంపెనీ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. నథింగ్ ఫోన్ 1 తర్వాత కంపెనీ నుంచి రాబోతున్న స్మార్ట్ ఫోన్ ఇదే. పాత దానితో పోలిస్తే కొత్త దానిలో కొన్ని ఫీచర్లను అదనంగా యాడ్ చేశారు.


నథింగ్ ఫోన్ 2 స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoC ప్రాసెసర్‌తో రానుందని కంపెనీ గతంలో ధృవీకరించింది. ఫోన్ 6.7-అంగుళాల డిస్ప్లే,పెద్ద 4,700mAh బ్యాటరీని కలిగి ఉండనుంది. ప్రధాన కెమెరా 50MP ఉండవచ్చు. పూర్తి ఫీచర్లను కంపెనీ లాంచ్ ఈవెంట్‌లో ప్రకటించనున్నారు.

Tags:    

Similar News