సోనీ సెన్సార్లతో Realme కొత్త మోడల్.. 10 నిమిషాల్లో 50% చార్జింగ్

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌‌ఫోన్ తయారీ కంపెనీ రియల్‌మీ ఇండియాలో కొత్త మోడల్‌ను విడుదల చేసింది. దీని పేరు ‘Realme GT 6T’.

Update: 2024-05-22 13:56 GMT

దిశ, టెక్నాలజీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌‌ఫోన్ తయారీ కంపెనీ రియల్‌మీ ఇండియాలో కొత్త మోడల్‌ను విడుదల చేసింది. దీని పేరు ‘Realme GT 6T’. ఇది సోనీ LYT-600 కెమెరా సెన్సార్‌తో వచ్చింది. ఈ ఫోన్‌పై కంపెనీ మూడు సంవత్సరాలు OS అప్‌గ్రేడ్‌లు, నాలుగేళ్ళ పాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు అందిస్తామని ప్రకటించింది. ముఖ్యంగా ఈ మోడల్ కేవలం 10 నిమిషాల్లో 50 శాతం చార్జ్ అవుతుంది.

8GB RAM+ 128GB స్టోరేజ్ ధర రూ.30,999. 8GB+256GB ధర రూ.32,999. 12GB+256GB ధర రూ. 35,999. 12GB+512GB ధర రూ.39,999. ఫోన్ ఫ్లూయిడ్ సిల్వర్, రేజర్ గ్రీన్ కలర్‌‌లో ఉంటుంది. అమెజాన్, కంపెనీ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా మే 29 మధ్యాహ్నం నుంచి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. కొనుగోలు సమయంలో ICICI బ్యాంక్, HDFC, SBI కార్డ్‌లపై రూ.4,000 తగ్గింపు ఉంది అలాగే రూ. 2,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా లభిస్తుంది.


Realme GT 6T స్పెసిఫికేషన్స్

* 6.78-అంగుళాల పూర్తి-HD+ (1,264x2,780 పిక్సెల్‌లు) LTPO M OLED డిస్‌ప్లే.

* 120Hz రిఫ్రెష్ రేట్‌, 1,000 nits గరిష్ట బ్రైట్‌నెస్

* 4nm స్నాప్‌డ్రాగన్ 7+ Gen 3 చిప్‌ ద్వారా పనిచేస్తు్ంది.

* ఆండ్రాయిడ్ 14-ఆధారిత Realme UI 5పై రన్ అవుతుంది.

* బ్యాక్‌సైడ్ 50MP సోనీ కెమెరా+8MP సెన్సార్‌లు ఉన్నాయి.

* సెల్ఫీల కోసం 32MP సోనీ కెమెరా సెన్సార్ అందించారు.

* 120W ఫాస్ట్ చార్జింగ్‌తో 5,500mAh బ్యాటరీ ఉంది.

* ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఇన్-డిస్‌ప్లేలో అమర్చారు.

* 10 నిమిషాల్లో ఫోన్ 50 శాతం చార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంటుంది.

Similar News