మరో నాలుగు రోజుల్లో మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్

చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ Poco ఇండియా మార్కెట్లోకి బేస్ మోడల్, ప్రో వేరియంట్‌తో కూడిన Poco X5 సిరీస్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.

Update: 2023-02-02 04:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ Poco ఇండియా మార్కెట్లోకి బేస్ మోడల్, ప్రో వేరియంట్‌తో కూడిన Poco X5 సిరీస్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. నివేదికల ఆధారంగా Poco X5 సిరీస్ ఫిబ్రవరి 6న లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Poco X5 Pro 5G, 108-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 778G SoC ఆధారంగా పనిచేస్తుంది. 6GB RAM + 128GB మెమరీ, 8GB RAM + 128GB మెమరీ, 8GB RAM + 256GB మెమెరీలలో లభిస్తుంది.



Poco X5 5G వేరియంట్ ఫీచర్స్ గురించి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో 1,080x2,400 రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌, 1200నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది, కంటికి ఎఫెక్ట్ కాకుండా తక్కువ బ్లూ లైట్ సర్టిఫికెట్ కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 695, Adreno 619 గ్రాఫిక్ కార్డును అందించారు. ఫోన్‌లో 48MP మెయిన్ కెమెరా + 8MP వైడ్-యాంగిల్ + 2MP మాక్రో కెమెరాలు ఉన్నాయి. అలాగే, సెల్ఫీల కోసం 13MP కెమెరా ఉంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.




Similar News