తక్కువ ధరలో అదిరే ఫీచర్స్‌తో ఇండియాలోకి Poco స్మార్ట్ ఫోన్

చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ Poco నుంచి కొత్త మోడల్ ‘Poco X5 5G’ మార్చి 14 న భారత మార్కెట్లోకి విడుదల కానుందని కంపెనీ పేర్కొంది.

Update: 2023-03-09 11:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ Poco నుంచి కొత్త మోడల్ ‘Poco X5 5G’ మార్చి 14 న భారత మార్కెట్లోకి విడుదల కానుందని కంపెనీ పేర్కొంది. ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా మూడు కలర్స్‌లో ఫోన్ కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. 8GB RAM + 256 GB స్టోరేజ్‌ ధర రూ. 20,000 వరకు ఉండే అవకాశం ఉందని సమాచారం.


Poco X5 5G స్పెసిఫికేషన్స్

* 6.67-అంగుళాల AMOLED ఫుల్-HD+ (1,080 x 2,400 పిక్సెల్‌లు) డిస్‌ప్లే.

* 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌, హోల్-పంచ్ కటౌట్ డిస్ప్లే.

* Android 12-ఆధారిత MIUI 13 పై రన్ అవుతుంది.

* స్నాప్‌డ్రాగన్ 695 SoC ద్వారా పనిచేస్తుంది.

* ఫోన్ బ్యాక్ సైడ్ 48MP+8MP+2MP కెమెరాలు ఉన్నాయి.

* ముందు సెల్ఫీల కోసం 16MP కెమెరా ఉంది.

* 33W ఫాస్ట్ చార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని అందించారు.

* ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ సైడ్‌కు అమర్చారు.



Tags:    

Similar News