OnePlus నుంచి Nord CE 3 5G స్మార్ట్ ఫోన్

స్మార్ట్ ఫోన్ దిగ్గజం OnePlus నుంచి కొత్త మోడల్ రానుంది. దీని పేరు ‘OnePlus Nord CE 3 5G’. ఇండియాలో జులై 5 న లాంచ్ అవుతుందని సమాచారం

Update: 2023-06-27 12:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్ ఫోన్ దిగ్గజం OnePlus నుంచి కొత్త మోడల్ రానుంది. దీని పేరు ‘OnePlus Nord CE 3 5G’. ఇండియాలో జులై 5 న లాంచ్ అవుతుందని సమాచారం. దీని ధర దాదాపు రూ. 30,000 వరకు ఉండే అవకాశం ఉంది. ఫోన్ ఆక్వా సర్జ్, గ్రే షిమ్మర్ కలర్ ఆప్షన్‌లలో లభించనుంది. కొన్ని నివేదికల ప్రకారం, Nord CE 3 స్మార్ట్ ఫోన్ 6.7-అంగుళాల ఫ్లూయిడ్ AMOLED డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుందని తెలుస్తుంది. ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 782G SoC ద్వారా పనిచేయనుంది. ఆక్సిజన్ OS 13.1 స్కిన్‌తో Android 13 పై రన్ అవుతుంది.

ఫోన్ బ్యాక్ సైడ్ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ సెన్సార్, 2-మెగాపిక్సెల్ సెన్సార్‌లు ఉండనున్నాయి. ముందు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫోన్‌లో 30fps వద్ద 4Kలో వీడియో రికార్డింగ్‌ని చేయవచ్చు. ఇది 80W వైర్డు చార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కంపెనీ రెండు సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందించనుంది. అలాగే, కంపెనీ OnePlus Nord Buds 2R ను కూడా లాంచ్ చేయనుంది.

Read More..

ఐఫోన్ 15 సిరీస్‌లో మ్యూట్ బటన్, వాల్యూమ్ బటన్‌లో మార్పులు  

Tags:    

Similar News