100W ఫాస్ట్ చార్జింగ్, 2K డిస్‌ప్లే‌తో 'OnePlus 11 5G' స్మార్ట్‌ఫోన్

OnePlus నుంచి కొత్తగా 'OnePlus 11 5G' స్మార్ట్‌ఫోన్ భారత్‌లో లాంచ్ అయింది.

Update: 2023-02-07 17:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: OnePlus నుంచి కొత్తగా 'OnePlus 11 5G' స్మార్ట్‌ఫోన్ భారత్‌లో లాంచ్ అయింది. ఇది 2023లో కంపెనీ నుంచి రాబోతున్న మొట్టమొదటి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్. 8GB RAM+ 128GB స్టోరేజ్ ధర రూ. 56,999, అదే 12GB RAM+ 256G స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 61,999. ఫోన్ ఎటర్నల్ గ్రీన్, టైటాన్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో అమ్మకానికి ఉంటుంది. ఫోన్ ఫిబ్రవరి 14న OnePlus ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ రిటైల్ భాగస్వాముల ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.



OnePlus 11 5G స్పెసిఫికేషన్‌లు

* 6.7-అంగుళాల Quad-HD(2K)+ (1,440x3,216 పిక్సెల్‌లు) AMOLED స్క్రీన్‌.

* స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoC ద్వారా Adreno 740 GPU ప్రాసెసర్.

* ఆక్సిజన్‌ ఓఎస్ 13 ఇంటర్‌ఫేస్‌తో ఆండ్రాయిడ్ 13తో రన్ అవుతుంది.

* బ్యాక్ సైడ్ 50MP+48MP+32MP కెమెరాలు ఉన్నాయి.

* ముందు సెల్ఫీల కోసం 16MP కెమెరా ఉంది.

* 100W ఫాస్ట్ చార్జింగ్‌తో 5000mAh బ్యాటరీ ఉంది.

* ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ రికగ్నిషన్ సపోర్ట్ ఉన్నాయి.




Tags:    

Similar News