రూ. 6 వేల లోపు ధరలో సరికొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్

itel కంపెనీ నుంచి కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ ‘itel A60’ విడుదలైంది. దాని ధర రూ. 5,999

Update: 2023-03-10 10:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: itel కంపెనీ నుంచి కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ ‘itel A60’ విడుదలైంది. దాని ధర రూ. 5,999. డాన్ బ్లూ, వెర్ట్ మెంథె, సఫైర్ బ్లాక్ అనే మూడు కలర్స్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. 5000mAh బ్యాటరీతో అతి తక్కువ ధరలో వినియోగదారులకు అందుబాటులో తీసుకురావడం ద్వారా భారత మార్కెట్లో స్మార్ట్ ఫోన్ అమ్మకాలను క్రమంగా పెంచాలని చూస్తున్నట్లు itel CEO అరిజీత్ తలపత్ర అన్నారు.


ఫోన్ 6.6-అంగుళాల HD+ వాటర్ డ్రాప్ ఫుల్‌స్క్రీన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. SC9832E చిప్‌సెట్ ద్వారా, ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్‌తో రన్ అవుతుంది. ఫోన్ బ్యాక్ సైడ్ 8MP కెమెరా, ముందు 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ కూడా ఉంది. ఫోన్‌లో 2GB RAMతో 32 GB మెమరీని అందించారు. దీనిని మైక్రో SD కార్డు ద్వారా 128GB వరకు పెంచుకోవచ్చు.



Tags:    

Similar News