ఎక్స్‌లో పాటలు, సీరియల్స్, సినిమాలు..! ఎలాన్ మస్క్ ఆసక్తికర ట్వీట్

సోషల్ మీడియాలో దిగ్గజ ప్లాట్‌ఫాం అయిన ట్విట్టర్‌లో ఫీచర్స్ గురించి సంస్థ అధినేత, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఆసక్తికర ట్వీట్ చేశారు.

Update: 2024-05-10 06:30 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో దిగ్గజ ప్లాట్‌ఫాం అయిన ట్విట్టర్‌లో ఫీచర్స్ గురించి సంస్థ అధినేత, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ట్విట్టర్ (ఎక్స్) వేదికగా పాటలు, టీవీ సీరియల్స్, సినిమాలు లాంటి ఎక్కువ నిడివిగల వీడియోలు పోస్ట్ చేసుకోవచ్చని ప్రకటించారు.

అయితే, ట్విట్టర్‌లో సబ్ స్క్రీప్షన్ ఉన్న వాళ్లకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని మెలిక పెట్టారు. మరోవైపు ఎక్స్ వీడియోలు అంటే తనకు ఎంతో ఇష్టమని ఎలాన్ మస్క్ కామెంట్ చేశారు. కాగా, ఎక్కువ నిడివిగల వీడియోలు సంబంధించిన ఫీచర్ ఎలాన్ మస్క్ పోయిన ఏడాదే ప్రవేశ పెట్టారు. కేవలం సబ్ స్క్రిప్షన్ ఉన్నవారికే ఈ అవకాశం ఉంది.

Tags:    

Similar News