నెలకు రూ. 347 EMIతో 'Infinix Note 12i' స్మార్ట్ ఫోన్
Infinix కంపెనీ కొత్తగా 'Note 12i' స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
దిశ, వెబ్‌డెస్క్: Infinix కంపెనీ కొత్తగా 'Note 12i' స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీని ధర రూ. 10,000 లోపు ఉంటుందని సమాచారం. ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా జనవరి 30 నుండి అమ్మకానికి అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. కొనుగోలు సమయంలో వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్, రూ. 500 వరకు విలువైన ఫ్లిప్‌కార్ట్ గిఫ్ట్ కార్డ్ కూడా పొందవచ్చు. స్మార్ట్‌ఫోన్ EMI నెలకు రూ. 347 నుండి ప్రారంభమవుతుంది.
Infinix Note 12i స్పెసిఫికేషన్స్
* 6.7-అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే.
* MediaTek Helio G85, GPU Mali-G52 చిప్సెట్.
* Android 12 ఆధారంగా XOS 12.0పై రన్ అవుతుంది.
* 4GB RAM, 64GB స్టోరేజ్. దీనిని మైక్రో SD కార్డు ద్వారా పెంచుకోవచ్చు.
* స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.
* 50MP+ 2MP డెప్త్ సెన్సార్+ QVSA AI కెమెరాను కలిగి ఉంది.
* ముందు సెల్ఫీల కోసం 8MP కెమెరాను అమర్చారు.
* 33W చార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.