సరికొత్త ఫీచర్స్‌తో Fire-Boltt స్మార్ట్‌వాచ్
ప్రముఖ స్మార్ట్‌వాచ్ తయారీ కంపెనీ ఫైర్-బోల్ట్ ఇండియాలో కొత్త మోడల్ స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. దీని పేరు ‘ఒరాకిల్’.
దిశ, టెక్నాలజీ: ప్రముఖ స్మార్ట్‌వాచ్ తయారీ కంపెనీ ఫైర్-బోల్ట్ ఇండియాలో కొత్త మోడల్ స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. దీని పేరు ‘ఒరాకిల్’. ప్రారంభ ధర రూ.4,999. కంపెనీ అధికారిక వెబ్సైట్, ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంది. కొనుగోలు సమయంలో ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై తగ్గింపులు కూడా ఉన్నాయి. ఈ వాచ్ Android-ఆధారిత FireOSపై రన్ అవుతుంది.
అనేక Google Play స్టోర్ అప్లికేషన్లకు సపోర్ట్ చేస్తుంది. సోషల్ మీడియా, ఎంటర్టైన్మెంట్, ఫుడ్ డెలివరీ, రైడ్ బుకింగ్, షాపింగ్ వంటి అనేక గూగుల్ ప్లేస్టోర్ అప్లికేషన్లకు సపోర్ట్ ఇస్తుంది. అనేక వాచ్‌ఫేస్‌లు, బహుళ స్పోర్ట్స్ మోడల్‌లు, హెల్త్ కోసం హృదయ స్పందన రేటు, రక్త ఆక్సిజన్ స్థాయి ట్రాకింగ్ సెన్సార్లు, ఇంకా పలు ఫీచర్లు ఉన్నాయి. ఇన్‌బిల్ట్ స్పీకర్లను కూడా అందించారు. Android, iOS రెండింటికీ అనుకూలంగా ఉంటుంది.
Fire-Boltt ఒరాకిల్ స్మార్ట్‌వాచ్ 320 x 386 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.96-అంగుళాల IPS స్క్రాచ్-రెసిస్టెంట్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇంకా 2GB RAM 16GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వచ్చింది. స్మార్ట్‌వాచ్ నుంచే నేరుగా కాల్స్ చేయవచ్చు. 4G నానో-సిమ్ కార్డ్ ద్వారా 4G LTE కాలింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది, Wi-Fi కనెక్టివిటీకి కూడా ఉంది. ఎక్కువ సమయం వాడుకోవడానికి దీనిలో 700mAh బ్యాటరీని అమర్చారు. ఇది స్టాండ్బైలో 72 గంటల వరకు, సాధారణంగా 10 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. ఇది దుమ్ము, ధూళి నుంచి రక్షణ కోసం IP67 రేటింగ్‌ను కలిగి ఉంది.