సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా..అయితే ఇవి తెలుసుకోండి?

ప్రస్తుత ఆధునిక కాలంలో టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో చూస్తునే ఉన్నాం. ప్రపంచం మొత్తాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్న స్మార్ట్ ఫోన్ మన చేతుల్లోనే ఉంది.

Update: 2024-05-22 11:29 GMT

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆధునిక కాలంలో టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో చూస్తునే ఉన్నాం. ప్రపంచం మొత్తాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్న స్మార్ట్ ఫోన్ మన చేతుల్లోనే ఉంది. ప్రజెంట్ జనరేషన్‌లో స్మార్ట్ ఫోన్ వినియోగం ఎంతలా పెరిగిపోయిందో గమనిస్తునే ఉన్నాం. చిన్న పెద్ద తేడా లేకుండా అందరు స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే క్రమంలో డబ్బులు ఎంతైనా పర్వాలేదు మంచి ఫీచర్స్ ఉండాలని కోరుకుంటారు. మరికొందరు సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటారు. అయితే సెకండ్ హ్యాండ్ మొబైల్ తీసుకునే వారు కొన్ని గమనించాల్సి ఉంటుంది. లేకపోతే ఫోన్ కొన్న కొద్ది రోజులకే పాడైపోయే పరిస్థితులు వస్తాయి.

కొనుగోలు చేసే ముందు ఇవి గమనించండి..

ఈ ఫోన్ కొనుగోలు చేసే ముందు అది దొంగిలించబడిందా లేదా బ్లాక్‌లిస్ట్ చేయబడిందా కనుగొనండి. IMEI నంబర్‌ని తనిఖీ చేయడం ద్వారా మీరు దీన్ని కనుగొనవచ్చు. ఫోన్ స్క్రీన్‌పై పగుళ్లు, గీతలు ఉన్నాయా? టచ్ పనిచేస్తుందా? కొత్త సాఫ్ట్ వేర్, యాప్స్‌కి సపోర్ట్ చేస్తుందా చూడాలి. స్క్రీన్‌పై ఏవైనా పగుళ్లు ఉన్నాయా? అన్ని బటన్లు, ఛార్జింగ్ పోర్ట్‌లు సరిగ్గా పని చేస్తున్నాయో లేదో కూడా తనిఖీ చేయండి. ఫోన్ ఎంత పాతది అనే విషయం కూడా తెలుసుకోండి. ఎందుకంటే చాలా పాత ఫోన్‌లకు కొత్త సాఫ్ట్‌వేర్ లేదా యాప్‌లకు మద్దతు ఇవ్వలేకపోవచ్చు. ఫోన్ వాడుతున్నప్పుడు బ్యాటరీ లైఫ్ చాలా ముఖ్యం. అందుకే పాత ఫోన్ కొనే ముందు కచ్చితంగా బ్యాటరీ కండిషన్ చెక్ చేసుకోండి.

బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి ఎంత సమయం పడుతుందో చూడండి. ఆ చార్జింగ్ ఎంతసేపు ఉంటుందో గమనించండి. ఈ ఫోన్ తాజా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను సపోర్ట్ చేస్తుందో లేదో కూడా తెలుసుకోండి. ముందుగా మీరు ఫోన్ ఏ ధరకు పొందుతున్నారో తెలుసుకోండి. దీని తర్వాత, మీరు ఆ ధరకు పొందుతున్న ఇతర బ్రాండ్‌ల ఫోన్‌లను కనుగొనండి. ఫోన్‌లో యాప్‌లను రన్ చేయండి, ఇంటర్నెట్‌ని బ్రౌజ్ చేయండి. కెమెరా నాణ్యతను చెక్ చేయండి. ఫోన్‌కి హ్యాంగింగ్ లేదా స్లో స్పీడ్ వంటి ఎలాంటి సమస్య లేకుండా చూసుకోండి. మీ ఫోటోలు, వీడియోలు, యాప్‌ల కోసం మీ అవసరానికి అనుగుణంగా స్టోరెజ్ సరిపోతుందో లేదో చెక్ చేయండి. పైన చెప్పిన విధంగా చెక్ చేసుకున్న తర్వాత మీరు ఫోన్ కొనుగోలు చేయండి.

Similar News