ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో టీమ్ ఇండియాదే ఆధిపత్యం

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్‌తో జరుగనున్న 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్ ఇండియా కచ్చితంగా ఆధిపత్యం చెలాయిస్తుందని మాజీ క్రికెటర్ సునిల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. అగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు జరుగున్న టెస్ట్ సిరీస్‌లో టీమ్ ఇండియా 4-0 తేడాతో విజయం సాధించే అవకాశం ఉన్నట్లు ఆయన అంచనా వేశారు. ‘డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన తర్వాత టెస్టు సిరీస్‌కు ఆరు వారాల గ్యాప్ ఉంటుంది. కాబట్టి ఆ మ్యాచ్ ప్రభావం ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు […]

Update: 2021-06-04 10:43 GMT

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్‌తో జరుగనున్న 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్ ఇండియా కచ్చితంగా ఆధిపత్యం చెలాయిస్తుందని మాజీ క్రికెటర్ సునిల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. అగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు జరుగున్న టెస్ట్ సిరీస్‌లో టీమ్ ఇండియా 4-0 తేడాతో విజయం సాధించే అవకాశం ఉన్నట్లు ఆయన అంచనా వేశారు. ‘డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన తర్వాత టెస్టు సిరీస్‌కు ఆరు వారాల గ్యాప్ ఉంటుంది. కాబట్టి ఆ మ్యాచ్ ప్రభావం ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌పై ఉండదు. ఇంగ్లాండ్‌లో పిచ్‌లు బౌన్సీగా ఉంటాయి. ఇండియాలో జరిగిన పరాభవానికి గాను ఇంగ్లాండ్ పచ్చిక కలిగిన పిచ్‌లను తయారు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. కాగా, అలా చేసినా కోహ్లీ సేన భయపడదు. గతంలో అలాంటి పిచ్‌లపై టీమ్ ఇండియా బౌలర్లు రాణించారు. కచ్చితంగా ఇంగ్లీష్ జట్టుపై క్లీన్ స్వీప్ చేస్తారు’ అని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఇంగ్లాండ్ పిచ్‌లు ఎండాకాలంలో టర్న్ అవుతూ ఉంటాయి. దీంతో స్పిన్నర్లకు కూడా అనుకూలంగా ఉంటాయని గవాస్కర్ చెబుతున్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News