రాజమండ్రి జైలు నుంచి టీడీపీ నేత పట్టాభి విడుదల

దిశ, ఏపీ బ్యూరో: రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ బెయిల్‌పై విడుదలయ్యారు. హైకోర్టు శనివారం పట్టాభికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ఆదేశాలు అందడంతో పట్టాభి జైలు నుంచి విడుదలయ్యారు. ఇకపోతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పట్టాభి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. బుధవారం రాత్రి అరెస్ట్ అయిన పట్టాభికి కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించింది. […]

Update: 2021-10-23 08:52 GMT

దిశ, ఏపీ బ్యూరో: రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ బెయిల్‌పై విడుదలయ్యారు. హైకోర్టు శనివారం పట్టాభికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ఆదేశాలు అందడంతో పట్టాభి జైలు నుంచి విడుదలయ్యారు. ఇకపోతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పట్టాభి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. బుధవారం రాత్రి అరెస్ట్ అయిన పట్టాభికి కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించింది. దీంతో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండగా.. హైకోర్టులో బెయిల్‌ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్‌పై రెండురోజులపాటు వాదనలు జరిగాయి. ఇరువాదనలు విన్న ధర్మాసనం రూ.20వేల సొంత పూచీకత్తు.. ఇద్దరు జామీనులతో పట్టాభికి బెయిల్ మంజూరు చేసింది.

Tags:    

Similar News