విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలొద్దు: లోకేశ్

దిశ, ఏపీ బ్యూరో: మీ పిల్లలకు మాత్రమే ఫారెన్ చదువులా.. బడుగు, బలహీన వర్గాల యువత విదేశాల్లో చదువుకోవడానికి అర్హులు కారా అని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్​ ప్రశ్నించారు. ఆదివారం ఆయన ట్విటర్​లో ప్రభుత్వాన్ని విమర్శించారు. ఎన్టీఆర్ విదేశీ విద్య పథకాన్ని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఎన్నికల ముందు కూతలు.. అధికారం వచ్చాక కోతలు అని తూర్పారబట్టారు. ఇప్పుడు ఏకంగా ప్రైవేట్‌ కాలేజీల్లో చదివే పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం […]

Update: 2020-12-27 09:59 GMT

దిశ, ఏపీ బ్యూరో: మీ పిల్లలకు మాత్రమే ఫారెన్ చదువులా.. బడుగు, బలహీన వర్గాల యువత విదేశాల్లో చదువుకోవడానికి అర్హులు కారా అని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్​ ప్రశ్నించారు. ఆదివారం ఆయన ట్విటర్​లో ప్రభుత్వాన్ని విమర్శించారు. ఎన్టీఆర్ విదేశీ విద్య పథకాన్ని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఎన్నికల ముందు కూతలు.. అధికారం వచ్చాక కోతలు అని తూర్పారబట్టారు. ఇప్పుడు ఏకంగా ప్రైవేట్‌ కాలేజీల్లో చదివే పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని దుయ్యబట్టారు. ఈ చర్యని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం మంచిది కాదు జగన్‌రెడ్డి అని అన్నారు. ప్రైవేట్‌ కాలేజీల్లో చదివే పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని రద్దు చేస్తూ ఇచ్చిన జీఓని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News